సోదర భావంను చాటేది ఇఫ్తార్ విందు

తాండూరు రాజకీయం వికారాబాద్

సోదర భావంను చాటేది ఇఫ్తార్ విందు
– చేవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని
– రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ముస్లింల మద్య ఉండే సోదర భావాన్ని ఇఫ్తార్‌ విందులు చాటి చెప్తాయని బీఆర్ఎస్ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హాజరై జడ్పి వైస్ చైర్మన్ బైండ్ల విజయ్, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి తదితరులతో పాటు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.

అనంతరం ముస్లిం సోదరులకు అందించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస ధీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ హిందూ ముస్లింల మద్య ఉండే సోదర భావాన్ని ఇఫ్తార్‌ విందులు చాటి చెప్తాయన్నారు. రంజాన్ పండగను ముస్లిం సోదరులు సోదరభావంతోనే జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, కాసాని వీరేష్ గారు, పంజుగుల శ్రీశైల రెడ్డి, పట్టణ అధ్యక్షులు నయూం (అఫ్ఫు), పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నర్శిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య