బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదు
– భూకబ్జాలు, రౌడీయుజం చేసేది బీఆర్ఎస్ నాయకులే
– మోడిపై నోరుజారితే తీవ్ర పరిమాణాలు తప్పవు
– బీజేపీ తాండూరు అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆపార్టీ తాండూరు అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్ బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు. బుధవారం తాండూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీపై, ప్రధాని మోడిపై చేసిన వాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పంచన చేరి బీజేపీపై, ప్రధాని మోడిపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. రౌడీయిజం, 2 నెంబర్ దందాలు చేసే బిఆర్ఎస్ నాయకులకు బీజేపీపై, ప్రధాని మోడిని విమర్శించే స్థాయి వాళ్లకు లేదన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నోరెత్తని నాయకులు, మద్యం స్కాంలో ఇరుక్కున్న కవిత అక్కకు మద్దతుగా నిలవడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ నేటికి ఎంఐఎం చేతిలో స్టీరింగ్ లా మారిందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టే పార్టీ తాండూరులో కూడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టే దమ్ముందా అంటూ సవాల్ చేశారు. మోడి ప్రధానిపై నోరుజారితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీపై, మోడిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.