సర్కారు విద్యార్థులకు గుడ్ న్యూస్
– పాఠ్య పుస్తకాలతో పాటు మరికొన్ని ఉచితం
– స్కూల్స్ ప్రారంభం నాటికి పంపిణీకి ఏర్పాట్లు
– ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడులలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలు ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాఠశాల విద్యపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్స్ బుక్స్… హై స్కూల్ స్టూడెంట్స్‌కు నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే టైమ్‌కు పిల్లలకు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందజేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో నోటు బుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించాలని.. పేరెంట్స్‌ను కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సూచించారు. అదేవిధంగా యునిఫామ్ల కోసం సుమారు రూ.150 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. గత అకడమిక్ ఇయర్ పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.132 కోట్లు ఖర్చు చేయగా.. వచ్చే విద్యా సంవత్సరానికి గాను రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ 12న పాఠశాలలు స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నందున.. ఆ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక నేతలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా 24 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

