వేయి శుభములు కలుగు మీకు..!
– బుయ్యని దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
– ఘనంగా వివాహా వార్షికోత్సవ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వేయి శుభాలు మెండుగా కలగాలని తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులకు పలవురు శుభాసీస్సులు తెలిపారు.

మంగళవారం శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డిల వివాహా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వారి పెళ్లి రోజు సందర్భంగా నివాసంలో రాజకీయ నేతలు, బందు మిత్రులు, ప్రముఖులు శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. శాలువా, పూలమాలతో సత్కరించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా వివాహా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు మొక్కలు నాటి వేడుకలను జరుపుకున్నారు. బుయ్యని దంపతుల పెళ్లిరోజు సందర్భంగా నివాసంలో సందడి ఏర్పడింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు మాట్లాడుతూ వ్యాపార రంగంలో, రాజకీయాల్లో ఉన్నా కూడా పేదలకు సేవ చేయడమే తమ ధ్యేయమని అన్నారు. తమకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, నాయకులు బంటు మల్లప్ప, ఏఎంసీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, వికాష్ జోషి, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


