విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్
– ప్రజలకు, రైతులు ఇబ్బందులు రాకుండా దృష్టి
– అధికారులను ఆదేశాలు జారీ చేసిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు రాకుండా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

వర్షాల కారణంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని అధికారులతో సమీక్షించారు. మంగళవారం విద్యుత్ అధికారులతో నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా సమస్యలపై ఫోన్‌లో మాట్లాడారు.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు ఇతర కారణాలతో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతన్నాయని తమ దృష్టికి వస్తున్నట్లు తెలిపారు. కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు కలగకుండా దృష్టిసారించాలని అన్నారు. ఒకవేళ సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఎప్పటికప్పుడు విద్యుత్ సమస్యలను సమీక్షించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి, ప్రజలకు మరియు రైతులు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా దృష్టిసారించాలని అన్నారు.

ఉపాధ్యాయుడిను ఢీ కొట్టిన ట్రాక్టర్..!