డీఈ లేకా పట్టణాభివృద్ధి డీలా..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

డీఈ లేకా పట్టణాభివృద్ధి డీలా..!
– వెంటనే అధికారిని నియమించాలి
– బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్‌ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో డీఈ లేకపోవడంతో పట్టణ అభివృద్ధి డీలా పడుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్‌ గౌడ్ అన్నారు.

గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన బదీలలో భాగంగా మున్సిపల్‌లో డీఈకి స్థానచలనం కలిగించారని గుర్తుచేశారు. గత 15 రోజులుగా డీఈ పోస్టు ఖాళీగా ఉండడంతో అభివృద్ధికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు.

దీంతో పాటు ఇంజనీరింగ్‌ శాఖకు సంబంధించి పరిపాలన వ్యవహారాలు సక్రమంగా కొనసాగడం లేదని అన్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు అందాల్సిన సేవలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డీఈ అధికారిని నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఏడాదిలో కొత్త మార్కెట్ యార్డు