మహా యోధుడు మహారాణా ప్రతాప్

తాండూరు రాజకీయం వికారాబాద్

మహా యోధుడు మహారాణా ప్రతాప్
– రాజ్ పుత్ సంఘానికి అండగా ఉంటాం
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– అట్టహాసంగా విగ్రహావిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహా యోధుడు మహారాణా ప్రతాప్ అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో మహారాణా ప్రతాప్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరులో మహా యోధుడు మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

మహారాణా ప్రతాప్ చరిత్రను అందరు తెలుసుకోవాలన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చేలా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ద్వారా కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా రాజ్ పుత్ సంఘానికి ఎకర స్థలం కేటాయించేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ విజయాదేవి, సంగీత ఠాకూర్, రాజ్ పుత్ సంఘం అధ్యక్షులు మహేష్ పింగ్ ఠాకూర్, గౌరవాధ్యక్షులు సుభాష్ సింగ్ ఠాకూర్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ సింగ్, ప్రధాన కార్యదర్శి శివనాంద్ సింగ్ ఠాకూర్. మాజీ అధ్యక్షులు మారజ్ సింగ్ ఠాకూర్, సభ్యులు శీతల్ సింగ్, జగన్ సింగ్, రమేష్ సింగ్, రఘువీర్ సింగ్, జీవస్ సింగ్, బాలాజీ సింగ్, ఠాకూర్ దీపక్ సింగ్, రాకేష్ సింగ్, శివాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.