మార్కులే కాదు విలువలకే ప్రాధాన్యం

కెరీర్ తాండూరు వికారాబాద్

మార్కులే కాదు విలువలకే ప్రాధాన్యం
– సిద్ధార్థ కాలేజీలో ర్యాంకుల సంబరం
– ఉత్సహాంగా విద్యార్థులకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మార్కులే కాదు విలువలకే ప్రాధాన్యమిస్తోందని తాండూరు సిద్దార్థ జూనియర్ కళాశాల యజమాన్యం పేర్కొంది. మంగళవారం విడుదలైన ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలలో మొదటి సంవత్సరంలో ఎంపీసీ లో కె. శ్రావణి(464/470), బైపీసీలో హారతి(435/440), సీఈసీలో అల్మాస్ నస్రిమ్(489/500), ఎంఈసిలో జోయా ఖానమ్(453/500), సెకండ్ ఇయర్‌ ఎంపీసీలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్నేహలత(991/1000) టాపర్‌గా నిలవగా బైపిసిలో హర్షిత(992/1000), శ్రీ చందన(984/1000), ఎంఈసిలో శాండర్ కిరణ్‌(971/1000) మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల బుధవారం సిద్దార్థ జూనియర్ కళాశాలలో సంబరాలు నిర్వహించారు. ఇందులో టాపర్లుగా నిలిచిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్పంచుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్పిపల్ నరేందర్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా నిలిపేందుకు సిద్దార్థ కళాశాలను స్థాపించడం జరిగిందన్నారు. కళాశాలలో విద్యార్థులకు మార్కులతో పాటు ఉన్నతమైన విలువలు నేర్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశలో ఇంటర్ చాలా కీలకమైందని, ఈ దశలోనే విద్యార్థులు, తల్లిదండ్రులు వారి భవిష్యత్తుపై దృష్టిసారించాలన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి తామూ ఎంచుకున్న రంగాలతో పాటు ఉత్తమ పౌరులను రూపొందించే బోధన రంగంలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కేక్‌ కట్ చేయించి తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ఐపీఎస్‌ అధికారికే మస్కా..!
– దోశ బిల్లు కట్టించే ప్రయత్నం
– వైరల్ అయిన సంఘటన
https://dharshininews.com/17059