ఇందిరానగర్‌లో తాగునీటి ఇబ్బంది

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇందిరానగర్‌లో తాగునీటి ఇబ్బంది
– ట్యాంకర్ తెప్పించిన కౌన్సిలర్ బోయ రవి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్‌ 6 వార్డులో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. కాలనీలో తాగునీటికి సంబంధించిన ఫాత పైపులైన్ మరమ్మత్తులకు గురికావడంతో నీటి సరఫరా స్థంభించింది. తాగునీరు లేక వార్డు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ బోయ రవి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మున్సిపల్ ట్యాంకర్‌ను రప్పించి కాలనీ వాసులకు తాగునీటిని సరఫరా చేయించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మరమ్మత్తులకు గురైన పైపులైన్‌కు మరమ్మత్తులు చేయించడంతో పాటు కొత్త పైపులైన్ అందుబాటులోకి తీసుకవచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చడం పట్ల కాలనీ మహిళలు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పిడుగుల భీభత్సం

chaithany collage