దోస్తు కుటుంబానికి చేయూత
– ఆర్థిక సాయం అందజేసిన స్నేహితులు.
– కృతజ్ఞతలు తెలిపిన బల్దియా జవాన్ కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుండెపోటుతో మరణించిన దోస్తు కుటుంబానికి అతని స్నేహితులు చేయూతను అందించారు. కుటుంబానికి ఆర్థిక సాయం చేసి భరోసా తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఎం.శ్రీను(31) తాండూరు మున్సిపల్లో జవాన్‌గా పనిచేసేవాడు. గత నెల మే 18న గుండెపోటుతో కన్నుమూశాడు. పేదరికంలో ఉన్న శ్రీను కుటుంబానికి తన ఇంటర్ స్నేహితులు చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం గౌతాపూర్ గ్రామంలోని శ్రీము కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్నేహితులంతా పోగు చేసిన రూ.26,100లను శ్రీను భార్య బాలమణికి అందజేశారు. ఏదైనా ఆపదలో ఉంటే తమవంతు సహాకారం అందిస్తామని కుటుంబానికి భరోసా అందించారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు స్నేహితులు చేసిన సాయాన్ని అభినందించారు.
ఇది కూడా చదవండి…


