ముదిరాజ్‌లకు ఆర్థిక సాయం వర్తింపజేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ముదిరాజ్‌లకు ఆర్థిక సాయం వర్తింపజేయాలి
– మత్స్యకారులకు రూ. 1 లక్ష అందించాలి
– యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం బీసీ చేతి, కుల వృత్తి దారులకు అందజేస్తున్న రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని ముదిరాజ్ కులస్తులకు వర్తింప చేయాలని ముదిరాజ్ యువజన సంఘం తాండూరు ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గంలో కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అమలు చేయడం శుభపరిణామన్నారు. అయితే ముదిరాజ్ వర్గంలోని కులస్తులకు కూడా ఈ సాయాన్ని వర్తింప చేయాలన్నారు. ముదిరాజ్ లోని మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష సాయం ఇవ్వాలన్నారు. అది కూడా మొదటి విడతలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage