విద్యకు అధిక ప్రాధాన్యత
– గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలు
విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి
– వికారాబాద్ లో గ్రంథాలయ నూతన భవన ప్రారంభం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.1కోటి 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆమె జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలను విస్తరించాలని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక గ్రంథాలయానికి బదులుగా మూడు జిల్లాల్లో జిల్లా గ్రంథాల సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నూతన గ్రంథాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా బాసర త్రిబుల్ ఐటీ లో జరిగిన విద్యార్థి బాధాకరమన్నారు. ఒక ప్రత్యేక కమిటీని నియమించడం జరిగిందని, దానిపై సమగ్ర నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ కార్యదర్శి సురేష్, సిబ్బంది కృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పిటిసి ముత్తాహ్ షరీఫ్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


