బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి
– విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి మెనూ భోజనం అందించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరులోని బీసీ బాలుర కళాశాల వసతిగృహాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉన్నాయా, మెను ప్రకారం భోజనం అందిస్తున్నారని లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జిలు పెంచాలని కోరారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు దుప్పట్లు అందించాలన్నారు. దీంతో పాటు అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకరావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ బసు, బీసీ యువ నాయకులు టైలర్ రమేష్, నర్సింహులు, మతిన్, జుంటుపల్లి వెంకట్, సాయి, నగేష్, హాస్టల్ వార్డెన్ సంగమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…


