ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : చేవేళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు గ‌డ్డం రంజిత్‌రెడ్డికి తాండూరు టీఆర్ఎస్ నాయ‌కులు రాజుగౌడ్, హ‌రిహ‌ర‌గౌడ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. శ‌నివారం ఎంపీ రంజిత్‌రెడ్డి జ‌న్మ‌దిన సంద‌ర్భంగా రాజుగౌడ్, హ‌రిహ‌ర‌గౌడ్‌లు హైద‌రాబాద్‌లో ఎంపీ రంజిత్‌రెడ్డిని క‌లిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డికి పుష్ప‌గుచ్చం అందించి జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు.