జినుగుర్తిలో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

జినుగుర్తిలో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
– విజేతగా ముంబాపూర్ జట్టు, రన్నర్ గా నిలిచిన జినుగుర్తి జట్టు
– బహుమతులు అందించిన సర్పంచ్ రత్నమ్మ. ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది. జినుగుర్తికి చెందిన తాండూరు నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు పి.రాములు ఆయన కుమారుడు స్వర్గీయ శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించారు. రెండు రోజులగా వాలీబాల్ పోటీలు ఉత్సహాంగా జరిగాయి. సోమవారం చివరి రోజు జరిగిన పోటీలో మంబాపూర్ జట్టు, జినుగుర్తి గ్రామ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో మంబాపూర్ జట్టు విజేతగా నిలవగా జినుగుర్తి జట్టు రన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రత్నమ్మ, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పి.రాములు ఆధ్వర్యంలో విజేతగా నిలిచిన మంబాపూర్ జట్టుకు మొదటి బహుమతి కింద రూ. 10 వేల నగదు, రన్నర్ గా నిలిచిన జినుగుర్తి జట్టుకు రెండో బహుమతి కింద రూ. 5 వేల నగదు, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రత్నమ్మ, ఎస్ఐ మధుసూధన్ రెడ్డిలు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు పి.రాములు ఆయన కుమారుడు స్మారకార్ధం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు కూడా అన్ని పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage