మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఖరారు
– వికారాబాద్ జిల్లాలో ల్యాటరీ ద్వారా కేటాయింపు
– ఎవరెవరినకి ఎన్ని దుకాణాలను కేటాయించారంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మద్యం నూతన పాలసీ అమలును అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఖరారు చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2023-2025 సంవత్సరాలకు మద్యం దుకాణాలను ఎస్టీ, ఎస్సీ, గౌడ కమ్యూనిటీలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ల్యాటరీ పద్దతిలో డ్రా తీసి దుకాణాలను కేటాయించారు. ఎక్సైజ్, గిరిజన, షెడ్యూల్ కులాల, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాలలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 9, గౌడ వర్గాలకు 6 చొప్పున 17 కేటాయించినట్లు వెల్లడించారు.
మిగతా 42 మద్యం షాపులు జనరల్ కేటగిరి కింద మిగిలినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు షాపులను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్ లతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

