9 నుంచి సదరం క్యాంపులు
– ఆగస్టు నెల క్యాంపుల షెడ్యూల్ విడుదల
– ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారంటే..?
వికారాబాద్, దర్శినికి ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో ఈనెల 9 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వైద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు నెలకు సంబంధించి క్యాంపుల నిర్వహణ తేదిలను, ఆసుపత్రుల వివరాలను వెల్లడించారు. ఈ ఆగస్టు నెలలో మొత్తం 7 క్యాంపులను నిర్వహించబోతున్నారు. వికలాంగత్వం, వినికిలోపం, మానసిక బుద్దిమాంద్యంకు సంబంధించి సదరం క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఈనెల 9న వికారాబాద్ సీహెచ్‌సీ ఆసుపత్రిలో వికలాంగత్వం, 10న తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో వికలాంగత్వం, 17న తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో వికలాంగత్వం, 22న తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో మానసిక బుద్ది మాంద్యం, అదేరోజు వికారాబాద్‌లోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో వికలాంగత్వం, 29న తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో మానసిక బుద్దిమాంద్యం, 30న తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో వినికిడి లోపం సంబంధించి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వికలాంగత్వం బాధితులకు 240, వినికిడి లోపం బాధితులకు 60, మానసిక బుద్ది మాంద్యం బాధితులకు 140 స్లాట్లకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. లబ్దిదారులు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి…

