ఇస్మార్ట్ కేటుగాళ్లు..!
– కానిస్టేబుల్ బైక్‌నే చోరీ చేశారు
– అదే బైకు సాయంతో గంజాయి వ్యాపారం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అసాంఘీక కార్యకలాపాలకు అలవాటు పడ్డ ఈ స్మార్ట్ కేటుగాళ్లు పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ బైకుకే కొట్టేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్రాలు దాటి గంజాయి వ్యాపారానికి సాయంగా వాడుకున్నారు. నిందితుల అదుపుతో విషయం తెలుసుకున్న పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు విద్యార్థులుతో సహా ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన రజనీకాంత్ ఐటిఐ చదువుతున్నాడు. అతడికి మాదాపూర్ మస్తాన్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ సమీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఈ ఇద్దరు స్నేహితులుగా మారారు. అప్పటికే సమీర్‌పై రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ఇద్దరూ కలిసి గంజాయి సరఫరా ప్రారంభించారు.
రజినీకాంత్ గ్రామానికే చెందిన బీటెక్ విద్యార్థి సాత్విక్ రెడ్డి… సూర్యాపేట జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థి వంశీ… ఖమ్మం ప్రాంతానికి చెందిన మల్టీ మీడియా విద్యార్థి హేమంత్.. వారితో జట్టు కట్టారు. గంజాయి కొలుగోలుకు అవసరమైన డబ్బు ఇచ్చి అమ్మేందుకు కూడా సహకరించేవారు. ఈ విధంగా లాభాలను వాటాలు వేసి పంచుకునేవారు. గంజాయి కొనుగోలు చేసి నగరానికి తరలించేందుకు ఏకంగా ఓ ఏ ఆర్ కానిస్టేబుల్ బైక్ కొట్టేశారు. తాజాగా దానిపై ఒరిస్సా మల్కనగిరి జిల్లా చిత్రకొండలో గంజాయి కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా రజనీకాంత్, సమీర్‌లను ఎస్ఓటి, అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు పట్టుకున్నారు. వారి విచారణలో తతంగమంతా వెలుగులోకి వచ్చింది. వారు ఇచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురుని అరెస్టు చేశారు. ఈ విధంగా వారి నుంచి ఐదు కిలోల గంజాయి, వాహనం నాలుగు మొబైల్ ఫోల్సిన స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి…

