ఓటు హక్కు విలువైన వజ్రాయుధం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓటు హక్కు విలువైన వజ్రాయుధం
– సమర్థ పాలకులను ఎన్నుకునే బ్రహ్మాస్త్రం
– పౌరులందరు ధైర్యంగా వినియోగించుకోవాలి
– 5కే రన్ తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
– పాల్గొన్న అధికారులు, సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి: పౌరులందరికి ఓటు విలువైన వజ్రాయుధమని, అందరు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాండూరు ఆర్డీఓ ఎం. శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు ‘నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’ అనే వివాదంతో 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి గౌతాపూర్ రోడ్డు మార్గంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పట్టణ పురవీదుల్లో ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. ర్యాలీలో ఓటు విలువను తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాతో ముందుకు సాగారు. అనంతరం సెయింట్ మార్క్స్ స్కూల్లో ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నిజమైన ప్రజా స్వామ్యానికి పునాది ఓటు అని అన్నారు.

పౌరలందరి చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు హక్కే అని, సమర్థవంతమైన పాలకులను ఎన్నుకునే బ్రహ్మాస్త్రం అన్నారు. కుల, మత, ప్రాంతం, భాష అనే భేదాభిప్రాయాలు లేకుండా రాజ్యాంగం అందరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. ఎన్నికల్లో పౌరులతో పాటు 18 ఏండ్లు నిండి ఓటు హక్కు కలిగిన యువతీ, యువకులందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మధుసూధన్ రెడ్డి, అబ్దుల్ రవూఫ్, కాశినాథ్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా, శానిటరీ ఇను స్పెక్టర్లు ఉమేష్ కుమార్, కృష్ణయ్య, ఆర్‌ఐ రాజారెడ్డి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!