ఎమ్మెల్యేపై బురదజల్లితే ఊరుకునేది లేదు
– బీఎస్పీ నేతలు అర్ధరహిత విమర్శలు మానుకోండి
– తాండూరు బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై బురదజల్లే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్థానిక బీఆర్ఎస్ నేతలు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నేతలను హెచ్చరించారు. బీఎస్పీ నాయకులు సత్యమూర్తి దొరశెట్టి మీడియా సమావేశంలో పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణను ముడిపెడుతూ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. ఆదివారం బీఆర్ఎస్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, ప్రవీణ్ పటేల్, రాజన్ గౌడ్ తదితరులు మాట్లాడారు. గత యేడాది సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కోసం మున్సిపల్ శాఖతో పాటు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అనుమతులు లభించని కారణంగా విగ్రహావిష్కరణ చేసుకోలేదని వివరించారు. ఈసారి ఎలాంటి అడ్డకుంలు లేకపోవడంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు.
దీనిపై బీఎస్పీ నేతలు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లాగి రాజకీయ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఎలాంటి అవగాహన లేకుండా వాళ్లు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. తాండూరులో అన్ని వర్గాల వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై బురదజల్లే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజలు తరిమికోట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి చంటి యాదవ్, నాయకులు శశికాంత్, ఎర్రం శ్రీధర్, యోగానంద్, మహేశ్వర్ రెడ్డి, సోము. ఎర్రం పవన్, దోమ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

