అట్టహాసంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలు
– జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, అల్పహారం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగింది. గురువారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రోగుల బందువులకు అల్పహారం పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి, నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి, మసూద్, జీ.రవీందర్, బంటు మల్లప్ప తదితరులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు అభివృద్దే ధ్యేయంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. జనంకోసం జననేతగా తాండూరు ప్రజల్లో స్థానం సంపాందించుకున్న ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కేశవరావు, యువనాయకులు టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


