చిలకవాగు కబ్జాలపై చిన్నచూపొద్దు..!
– అక్రమ కబ్జాలను తొలగించాలి
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని చిలుకవాగు కబ్జాలపై అధికారులు, నేతలు చిన్నచూపు చూడొద్దని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మున్సిపల్లోని మిత్రానగర్ నీట మునిగిపోయింది. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ నేతలతో కలిసి మిత్రానగర్ ను సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలుకవాగు కబ్జా వల్లే మిత్రా నగర్ నీటమునిగిందన్నారు. చిలకవాగు కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, భాను పవార్, విక్కి రెడ్డి, మహేష్, కాలనీ వాసులు దీపక్, ప్రతాప్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.


