గుంత‌ల రోడ్డుకు మ‌ర‌మ్మ‌త్తులు

తాండూరు

గుంత‌ల రోడ్డుకు మ‌ర‌మ్మ‌త్తులు
– శాంత్‌మ‌హాల్ రోడ్డుపై గతుకుల‌ పూడ్చివేత
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణం జిల్లా ఆసుప‌త్రి స‌మీపంలోని శాంత్‌మ‌హాల్ కాంప్లెక్స్ ముందు రోడ్డుపై గ‌తుకుల‌ను చ‌దును చేశారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో స్థానికులు ఇబ్బందులు ప‌డ్డారు. గురువారం మున్సిప‌ల్ అధికారులు రోడ్డుపై ఏర్ప‌డ్డ గుంత‌ల‌ను పూడ్చివేశారు.
మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ ఆదేశాల మేర‌కు మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు ద‌గ్గురుండి రోడ్డును చ‌దును చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ శానిట‌రి ఇనుస్పెక్టర్ శ్యాంసుంద‌ర్, సిబ్బంది ఉన్నారు.