లోక్ సభ బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– హర్షం వ్యక్తం చేసిన యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లోక్ సభ లో విప్ గా బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి లోక్ సభ స్పీకర్ కు పార్టీ తరుపున చీఫ్ విప్ మరియు విప్ లుగా నియమించిన వారి పేర్లను తెలియజేశారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం నుండి లోక్ సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి కూడా ఆ అవకాశం రావడం హర్షణీయమని తెలిపారు.
ఇదికూడా చదవండి…

