కాంగ్రెస్ ది ఆదుకునే తత్వం..!
– తాండూరు నాయకులు ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి
– బషీరాబాద్ ఫిజియోథెరఫిస్ట్ కుటుంబానికి చేయూత
– కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నాయకులలో పేదలను ఆదుకునే తత్వం ఉంటుందని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ నాయకులు ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలంకు చెందిన ఫిజియోథెరపిస్టు మెహరాజ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.
పార్టీ నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తన నివాసంలో కుటుంభ సభ్యులను కలిశారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని తనతో పాటు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ ల తరుపున తమవంతుగా రూ.50 వేల నగదును అందజేసి చేయూతనందించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నమ్ముకున్న వారిని ఆదుకునే తత్వం ఉంటుందన్నారు. అందుకనే కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

