కాంగ్రెస్ గెలుపును ఆపలేరు
– ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి
– బహిరంగ సభకు తరలిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని ఆ పార్టీ నాయకులు బుయ్యని ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పార్టీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్న బహిరంగ సభను జయప్రదం చేసేందుకు తరలివెళ్లడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో అందరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు అందిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు భీమప్ప, బషీరాబాద్ మండల మాజీ అధ్యక్షులు శంకరప్ప, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్, నాయకులు, సోషల్ మీడియా కోర్డినేటర్లు, కార్యకర్తలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

