ఆరో వార్డులో.. గెలుపు మాదే..!
– అధిష్ఠానం ఆశీర్వాదంతో పోటీకి సిద్దం
– ప్రజా ఆశీస్సులతో మెజార్టీ ఖాయం
– కాంగ్రెస్ నాయకులు వెంకట్‌రాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు పట్టణం ఇందిరానగర్ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో పోటీకి సిద్దమవుతున్నట్లు ఆ పార్టీ యువనాయకులు వెంకట్‌రాములు అన్నారు.

గతంలో ఇదే వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. 6వ వార్డులో ప్రజలతో ఉన్న సత్సంబంధాలే తన విజయానికి బలం చేకూరుస్తాయని అన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీతో పాటు ప్రజల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి కూడా పార్టీ అధిష్టానం, తాండూరు ఎమ్మెల్యే సహాకారంతో 6వ వార్డు టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీతో గెలుపు సాధిస్తామని.. కాంగ్రెస్ పార్టీకి వార్డు విజయాన్ని కానుకగా అందిస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

