బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదు
– పార్టీ మారిన మీరే పిరాయింపులపై వాఖ్యలు సిగ్గుచేటు
– మూల్యం చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఏఎంసీ చైర్మన్, మండల అధ్యక్షులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్, బషీరాబాద్ మండల బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాము నాయక్ తో పాటు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మల్లప్ప పలు మండలాలకు చెందిన సర్పంచులు, నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిపోయిందన్నారు. ఆ పార్టీలోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. ఆయన తల్లి కూడా కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా గెలిచి పార్టీ మారిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. గెలిపించిన ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సర్పంచులు, నేతలపై వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీలో చేరిన నేతలపై, సర్పంచులపై బెదిరింపులకు పాల్పడితే భయపడేది లేదన్నారు. వారి జోలికోస్తే ఊరునేది కూడా లేదన్నారు. ఎన్నో అరాచాకాలకు పాల్పడిన ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.

మరోవైపు పార్టీ మారిన నేతలు, సర్పంచులు మాట్లాడుతూ ఫిరాయింపుల విద్య ఎమ్మెల్యే ద్వారానే నేర్చుకున్నామన్నారు. పార్టీ నుంచి గెలిచి పొందిన పదవులకు వారు రాజీనామా చేస్తే మా పదవులకు కూడా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యాలాల మండల అధ్యక్షులు భీమప్ప, శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత