డీసీసీబీ బ్యాంకు సేవల విస్తరిస్తాం

తాండూరు రాజకీయం వికారాబాద్

డీసీసీబీ బ్యాంకు సేవల విస్తరిస్తాం
– మూడు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– బ్యాంకుల ద్వారా రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం
– లక్ష్మీనారాయణపూర్లో డీసీసీబీ బ్యాంకు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : డీసీసీబీ బ్యాంకుల సేవలను విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డీసీసీబీ జిల్లా చైర్మన్ కొత్త కురువ సత్యయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు పత్రాలను అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ బ్యాంకుల సేవలు గతంలో పట్టణాలకే పరిమితం అయ్యేవి.. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మారుమూల గ్రామాలకు విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ బ్యాంకుల ద్వారా రైతులకు లబ్దిచేకూరేందుకు తాండూరు నియోజకవర్గంలో కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రతి మండలానికి డీసీసీబీ బ్యాంకు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు, వ్యాపారులకు సబ్సీడీ రుణాలు అందుతాయని, ఈ బ్యాంకు సేవలను రైతులు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా రైస్ మిల్లులు, దాల్ మిల్లులు నిర్మించేందుకు తోడ్పాటు అందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సహాకార సంఘాల చైర్మన్లు సురేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటి చైర్మన్లు, సోసైటీల డైరెక్టర్లు, నేతలు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

తాండూరులో తైబజార్ క్లోజ్…!