కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
– న్యాయవాదులో సమావేశమైన శ్రీనివాస్ రెడ్డి
– మనోహర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరులోని తాండూరు న్యాయవాదులతో సమావేశం అయ్యారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు, మనోహర్ రెడ్డికి భారీ మెజార్టీకి మద్దతు ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి న్యాయవాదులను విజ్ఞప్తి చేశారు. తాండూరు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్ కు మెండుగా ఉందన్నారు. న్యాయవాదుల మద్దతు కూడా ఉంటే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు.

ఇందుకు సీనీయర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులు సూచించిన సమస్యల పరిష్కారానికి మనోహర్ రెడ్డి సహాకారంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..