కాంగ్రెస్ పార్టీకి షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీకి షాక్..!
– పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ ఆ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నేతలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. అవమానాలు తప్ప గౌరవం లేకుండా పోయిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందన్నారు.

తాండూరు ప్రజల హృదయాలను గెలుచుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలవడం ఖాయన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ఉదయ్ శంకర్ పటేల్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్థామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో పల్లే పరమేశ్వర్, ఏడ్రామి సిద్రామప్ప, మిట్టబాస్పల్లి శ్రీనివాస్ రెడ్డి, బాతుల రాజులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..