బ్యాగులో డబ్బుల మూట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బ్యాగులో డబ్బుల మూట..!
– బైకుపై వెళుతుండగా పట్టివేత
– సీజ్ చేసిన బషీరాబాద్‌ పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాత్రి వేళ బైకుపై డబ్బుల మూటతో వెళుతున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. బ్యాగులో దాచిన భారీ మొత్తాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బైకుపై వెళుతున్న వ్యక్తి వద్ద నుంచి సోదాలు చేశారు.

అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా రూ. 500ల నోట్లతో కూడిన కట్టలు లభ్యమయ్యాయి. బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ డబ్బులను లెక్కించారు. ఇందులో సుమారు రూ. 44లక్షల 84 వేలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వ్యక్తిని పోలీస్టేషన్‌కు తరలించారు. తరలిస్తున్న డబ్బును సీజ్ చేస్తున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. మరోవైపు డబ్బులు పెద్ద మొత్తంలో లభిస్తే కొంతవరకే చూపించారని పుకార్లు వినిపించాయి. ఇదిలా ఉండగా వ్యక్తి మాత్రం డబ్బులకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. ఓ ప్లాట్ కొనుగోలుకు సంబంధించి లావాదేవిలు జరిగాయని, అందుకు సంబంధించి జరిగిన అంగీకార పత్రాలు సైతం ఉన్నట్లు చూపించారని తెలిసింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!