రక్తదాతల సేవలు మరువలేనివి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రాణాపాయంలో రక్తదాతలు అందించే సేవలు మరువలేనివని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాధు పరిషత్ ఉత్సవాలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ గుర్తింపు పొందిన మీదిపేట వినోద్ కుమార్, చంద్రకాంత్ పంతులను పరిషత్ స్వాములు శంకర్ స్వామిజీ సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో, ప్రమాద సమయాల్లో రక్తదాతలు చేసే సేవలు మరువలేనివన్నారు. రక్తదాతలు సేవలను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



