గాంధీ స్పూర్తితో…
– బాపు బాటలో నడుద్దాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: జాతిపిత మహాత్మగాంధీ అందరికి స్పూర్తి ప్రధాయుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరై గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడ గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శం అని ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గాంధీజి ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ పల్లె పట్టణ ప్రగతి పేరుతో స్వచ్ఛభారత్ నిర్వహించి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విటల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, మాజీ మున్సిపల్ విశ్వనాథ్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్, రాజు గౌడ్, నర్సింలు, ఇర్ఫాన్, కౌన్సిలర్లు ముక్తార్ నాజ్, మంకాల్ రఘు, భీమ్ సింగ్, రవి రాజు, కో ఆప్షన్ సభ్యుడు వెంకట్ రామ్ నాయక్, ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, తదితరులు పాల్గొన్నారు.

