సదరం క్యాంపు షెడ్యూల్ ఖరారు
– రేపటి నుంచి స్లాట్ బుకింగ్
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో సదరం క్యాంపు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. జిల్లాలో ఈనెల 27, 29, 30వ తేదిలలో జిల్లాలోని తాండూరు, వికారాబాద్ ఆసుపత్రులలో క్యాంపులు జరుగుతాయని తెలిపారు. అంగవైకల్యానికి సంబంధి మొత్తం నాలుగు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

27వ తేదిన తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కోడంగల్, బొంరాస్ పేట్, బంటారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండలం, ధారూర్, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కోడంగల్ మండలం, వికారాబాద్ లోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో వికారాబాద్, పూడూరు, దోమ, కుల్కచర్ల, పరిగి, మర్పల్లి, మోమిన్ పేట్, నవాబ్ పేట్, కోట్‌పల్లి, వికారాబాద్ మండలం, పరిగి మండలాలకు క్యాంపు జరుగుతుందని తెలిపారు. 29వ తేదిన తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కోడంగల్, బొంరాస్ పేట్, బంటారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండలం, ధారూర్, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కోడంగల్ మండలాలకు క్యాంపు ఉంటుందన్నారు. 30వ తేదిన వికారాబాద్ లోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో వికారాబాద్, పూడూరు, దోమ, కుల్కచర్ల, పరిగి, మర్పల్లి, మోమిన్ పేట్, నవాబ్ పేట్, కోట్‌పల్లి, వికారాబాద్ మండలం, పరిగి మండలాలకు క్యాంపు జరుగుతుందన్నారు.
ఈ క్యాంపులకు సంబంధించి రేపు శనివారం ఉదయం ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గతంలో సదరం సర్టిఫికెట్ పొంది సర్టిఫికేట్ కాల పరిమితి దాటిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి…

