ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు
– వ్యక్తిని కొట్టి చంపిన దాయాదులు
– యాలాల మండలం పగిడిపల్లిలో దారుణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి తగదాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నాయి. దాయాదుల దాడిలో వ్యక్తి దారుణ హత్యకుగురయ్యాడు. ఈ సంఘటన యాలాల మండలం పగిడిపల్లి గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్తులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఎర్ర పకిరప్ప, ఎర్ర హన్మప్ప (45), ఎర్ర సమ్మప్పలు అన్నదమ్ములు. గత కొన్ని రోజులుగా అన్నదమ్ముల మద్య ఆస్తితగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఎర్ర హన్మప్పపై దాయాదులు దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో హన్మప్ప రక్తగాయాలతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అశోక్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఇదికూడా చదవండి…

