ఉత్సహాంగా గడప గడపకు బీజేపీ

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా గడప గడపకు బీజేపీ
– బీజేపీని గెలిపించాలని నేతల ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీజేపీ నేతలు ఉత్సహాంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని గుమాస్తా నగర్ లో నేతలు ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలని కోరారు.

బీజేపీ నేతల ప్రచారాన్ని ప్రజలు స్వాగతించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధి అభివృద్ధికి బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, సీనీయర్ నాయకులు గాజుల శాంతుకుమార్, శివ, అంతారం కిరణ్ కుమార్, సంజు, బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బడుల బలోపేతానికి దృష్టి