తాండూరులో గంజాయి గ్యాంగ్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో గంజాయి గ్యాంగ్..!
– పీచు మీఠాయితో పాటు మత్తు చాక్లెట్ల విక్రయాలు
– పోలీసుల అదుపులో యూపీకి చెందిన వ్యక్తి
– అసలు ఎలా బయటపడిందంటే..?
– పేరేంట్స్.. మీ పిల్లలు జాగ్రత్త
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పీచు మిఠాయిలు విక్రయిస్తున్న ముఠా గుట్టుగా చిన్నారులకు మత్తు చాక్లెట్లను అంటగడుతున్నారు. మీ పిల్లలు జాగ్రత్త అనే హెచ్చరించేలా ఈ సంఘటన బుధవారం తాండూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.

ప్రాథమిక సమాచారం మేరకు యూపీకి చెందిన ఓ ముఠా తాండూరులో గంజాయి చాక్లెట్ల విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యూపీ గ్యాంగ్ చిన్నారులకు పీచు మిఠాలు విక్రయిస్తూనే మత్తు చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నారు. పోలీసులు బుధవారం తాండూరు పట్టణంలో యూపీ గ్యాంగ్‌లోని వినేష్‌ నాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి 45 గంజాయి చాక్లెట్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి గ్యాంగు గుట్టును లాగేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఇటీవల బాల కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ స్మైల్ బృందం తనిఖీలు చేస్తుండగా ఈ గంజాయి గ్యాంగు మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో నిఘా ఉంచి గ్యాంగులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం నలుగురు ముఠా ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరు మాత్రమే పోలీసులకు పట్టుబడ్డారు.

ఇదికూడా చదవండి…

సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..!