మోబైల్ ఫోన్ ట్రేస్..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

మోబైల్ ఫోన్ ట్రేస్..!
– అప్పగించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోగొట్టుకున్న మోబైల్‌ ఫోన్‌ను పోలీసులు ట్రేస్ చేసి అప్పగించారు. ఈ విషయాన్ని తాండూరు పట్టణ ఎస్ఐ కాశినాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాథోడ్ అనిల్ కుమార్ అనే యువకుడు ఈనెల 6న మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని విలియమూన్ చౌరస్తాలో మోబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. పట్టణ పోలీసులను ఆశ్రయింఛి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొత్తగా వచ్చిన సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా మోబైల్‌ ఫోన్‌ను ట్రేస్ చేశారు.

48 గంటల్లోనే పోనును గుర్తించి ఎస్ఐ కాశినాథ్ చేతుల మీదుగా వినియోగదారునికి అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరిదైనా ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని, గుర్తించి అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదికూడా చదవండి…

బాలుడిపై వీధికుక్క దాడి