జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrజిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం..!
– అన్ని రంగాలలో ముందుంచేందుకు కృషి
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
– ఆసక్తికరంగా కొత్త కలెక్టర్ బయోడేటా
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని వికారాబాద్‌ జిల్లా కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా భద్రాచలం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతీక్‌ జైన్‌ను వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి నుంచి ప్రతీక్ జైన్ జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాను అన్ని రంగాలలో ముందుంచేందుకు అన్ని శాఖ ల అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరి సహకారం కృషి చేస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ గా పద్దోన్నతి కల్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రి గారికి , చీఫ్ సెక్రెటరి గారికి ఈ సందర్బంగా దన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్ డి ఓ లు వాసుచంద్ర, శ్రీనివాసులు, అన్ని శాఖ ల అధికారులు, మీడియా ప్రతినిధులు , సిబ్బంది పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా కొత్త కలెక్టర్ బయోడేటా ఇంట్రెస్టింట్‌గా మారింది.

కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ ఢిల్లీలోనే జన్మించి తన విద్యాభ్యాసం అంతా ఢిల్లీలో ఉన్న దయానంద విహార్ పబ్లిక్ స్కూల్లో చదివారు. 2009 సంవత్సరం నుండి 2013 సంవత్సరం వరకు ఐఐటి బీటెక్ త్రిబుల్ ఈఈఈ కోర్సు గౌహతిలో పూర్తి చేశారు. అలాగే 2017 నుండి 2019 వరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశారు. ఇండియాలో 88% ర్యాంకు రావడంతో తొలిసారి మే 2018 నుండి జూలై 2019 వరకు అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. జూలై 2019 నుండి అక్టోబర్ 2019 వరకు జల శక్తి మినిస్టరీ దగ్గర అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసి, 9 ఫిబ్రవరి 2020 రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పని చేసి పదోన్నతి పొందారు. ఈక్రమంలోనే భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌కు అభివృద్ధిపై మంచి విజన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి…

ఫ్రౌడ్‌.. ఫాదర్..!