టాప్‌ 7లో కరణ్‌ కోట్ ఠాణా..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

టాప్‌ 7లో కరణ్‌ కోట్ ఠాణా..!
– రాష్ట్ర డీజీపీ నుంచి ఉత్తమ అవార్డు
– అందుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని కరణ్‌ కోట్ పోస్టేషన్ టాప్‌ లేపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్టేషన్లలో ఉత్తమ పోలీస్టేషన్‌గా రాష్ట్ర స్థాయిలోనే 7వ ర్యాంకును సాధించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ఎస్ఐ విఠల్ రెడ్డి ఉత్తమ అవార్డును అందుకున్నారు. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్టేషన్లలో ప్రతి రెండు నెలలకోసారి సిటీజన్ ఫీడ్ బ్యాక్ సెంటర్ అనే సర్వే నిర్వహిస్తున్నారు.

ఇందులో పోలీస్టేషన్లలో ఎస్ఐ, సిబ్బంది పనితీరు ఎలా ఉంది..? ఫిర్యాదు దారుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు..? కేసుల పరిష్కారం ఎలా జరుగుతుందనే వివరాలను నమోదు చేస్తారు. దీని ఆధారంగా ఉత్తమ పోలీస్టేషన్లను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు. కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో ఎస్ఐగా విఠల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పోలీస్టేషన్‌ మెరుగు పడింది. సిటిజన్ ఫీడ్బ్యాక్ సెంటర్ సర్వేలో కరణ్‌కోట్ పోలీస్టేషన్ రాష్ట్రంలోనే టాప్‌ 7 పోలీస్టేషన్‌గా ఎంపికైంది.

ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అడిషనల్ డీజీ మహేష్‌ భగవత్‌ సమక్షంలో ఎస్ఐ విఠల్ రెడ్డి ఉత్తమ అవార్డును అందుకున్నారు. మరోవైపు కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌కు ఉత్తమ అవార్డు రావడం పట్ల జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు తాండూరు సబ్‌ డివిజన్ అధికారుల నుంచి అభినందనలు వెలువెత్తాయి. ఈ స్పూర్తితో మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం