రేపు తాండూరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక
– ఏర్పాట్లు చేసిన గ్లోబల్‌ యువతరం ఫౌండేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వేరోస్ సంస్థ వ్యవస్థాపకులు, ఐపీఎస్(వీఆర్ఎస్) డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు తాండూరుకు విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్లోబర్ యువతరం పౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. యువతరాన్ని మంచి మార్గంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మంబాపురం విజయేందర్ ఫౌండర్, ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పౌండేషన్ ను ప్రారంభిస్తారని నిర్వహకులు తెలిపారు. కావున పార్టీలకతీతంగా నాయకులు, యువకులు పెద్ద ఎత్తును హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

వర్షానికి కూలిన ఇళ్లు