సాహ‌సానికి సెల్యూట్..!

జాతీయం

 సాహ‌సానికి సెల్యూట్..!
– బుర‌ద‌లో నుంచి బాలున్ని కాపాడిన పోలీసు
– తెగ వైర‌ల్ అవుతున్న వీడియో
ద‌ర్శిని బ్యూరో: ధైర్య సాహ‌సాల‌కు పోలీసుల‌ను ప్ర‌తీక‌గా అభివ‌ర్ణించారు. ఎలాంటి ప‌రిస్థితుల‌లో అయినా వారి సాహసాల‌తో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు పాటుతుంటున్నారు. దీంతో అంద‌రు పోలీసుల‌కు సెల్యూట్ చేస్తారు. అశోక్ యాద‌వ్ అనే ఓ పోలీసు అధికారి అలాంటి సెల్యూట్‌ను అందుకుంటున్నారు. ఎందుకంటే అత‌ను చేసిన సాహ‌సం అలాంటిది మ‌రి. అత‌ను చేసిస సాహాసానికి సంబంధించి ఓ విడియో సోష‌ల్ మీడీయాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్‌ చేస్తున్నారు. పదే పదే చూస్తున్నారు.

వీడియోలో ఓ పోలీస్‌ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారి ప్రాణాలను కాపాడటం చూడ‌వ‌చ్చు. అతడి ప్రాణాలను లెక్కచేయకుండా నీటిలోకి దూకి బాలుడిని ఒడ్డుకు చేర్చడం వీడియోలో చూడవచ్చు. సచిన్ కౌశిక్ అనే వ్య‌క్తి త‌న ట్విట‌ర్ పేజీ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోను షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ ‘లోతైన నీటిలో మునిగిపోతున్న చిన్నారిని బయటకు తీశాడు. అశోక్ భాయ్ హ్యాట్సాప్ అంటూ కామెంట్’ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సాహస పోలీస్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చాలా ధైర్యం కలిగిన పోలీసని పొగడుతున్నారు. ఈ సాహస పోలీస్‌ పేరు అశోక్ యాదవ్. ఇతడు సీతాపూర్‌లో ఉంటున్నాడు. బాలుడిని కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.