ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉచిత ఇన్సురెన్స్
– రూ. 2 లక్షల వరకు ప్రమాద, మరణ బీమా
– షరతులు ఎంటంటే..?
దర్శిని డెస్క్ : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. బ్యాంకులోని ఖాతాలకు ఉచితంగా ఇన్సురెన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు కొన్ని షరతులను విధించింది. అదేంటంటే ఈ ప్రయోజనాలను కేవలం తమ వద్ద ఉన్న జన్ ధన్ ఖాతాలు(Jan Dhan Account) కలిగి రూపే డెబిట్ కార్డు ఉన్న వారికి మాత్రమేనని బ్యాంక్ స్పష్టం చేసింది. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను కేంద్రం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఖాతాలను అందిస్తోంది. ఈ అకౌంట్ తెరవటానికి కేవలం కేవైసీ నియమాలు పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ ఖాతాలు జీరో బ్యాలెన్స్ తోనూ తెరవవచ్చు. ఈ ఖాతాలు ఉన్న వినియోగదారులకు రెండు లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను ఉచితంగా అందిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సదుపాయాన్ని అందించేందుకు జన్ ధన్ కింద సదరు ఖాతాదారు ఆగస్టు28, 2018 ముందు లేక తరువాత దానిని ఓపెన్ చేశాడా అనే అంశం మీద ఆదారపడి ఉంటుంది. పైన తెలిపిన తేదీ తరువాత కొత్తగా ఖాతా తెరిచే వారికి మాత్రం ఈ రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఈ రెండిటిలోనూ ప్రయోజనాలు పొందటానికి రూపే డెబిట్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
షరతులు ఇవే..
బ్యాంకు ద్వారా అందించే ప్రమాద మరణ బీమా ప్రయోజనాలను పొందడానికి కొన్ని నిబంధనలు, షరతులు తప్పనిసరిగా పాటించాలి. ఉదాహరణకు.. జన్ ధన్ ఖాతాదారులు ప్రమాదం జరిగిన తేదీ నుండి 90 రోజుల మునుపు లింక్ చేయబడిన RuPay డెబిట్ కార్డ్‌తో ఇంట్రా లేదా ఇంటర్-బ్యాంక్ రెండింటిలో ఏదైనా ఛానెల్‌లో ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీని విజయవంతంగా నిర్వహించి ఉండాలి.

