ప్రజా పాలనపై రాక్షస నిందలు..!
– అడ్రస్ లేని కారు కూతలు మానుకోండి
– రెచ్చగొట్టకుండా రెస్టు తీసుకుంటే మేలు
– బుయ్యని బ్రదర్స్‌ను విమర్శించే స్థాయి కాదు
– తాండూరు యువనాయకులు వికాష్ జోషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో, తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుంటే ఓర్వలేక అడ్రస్ లేని నేతలు కారు కూతలు కూస్తున్నారని కాంగ్రెస్ యువనాయకులు వికాష్ జోషి ఎద్దేవా చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలపై చేసిన విమర్శనలను ఖండించారు. ప్రజా పాలనతో అందరికి సంక్షేమం, అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని అన్నారు. ఎన్నికల తరువాత డిసెంబర్ నుంచి అడ్రస్ లేని వారు ఫౌంహాస్ నుంచి బయటకు వచ్చి ప్రశాంత రాజకీయాలను విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
జన్వాడ ఫాం హౌస్, ఎర్రవెల్లి ఫాం హౌస్, అజీజ్ నగర్ ఫాం హౌస్ మాజీ ప్రజా ప్రతినిధులకి నాయకులకి విశ్రాంతి చాలా అవసరం ఉంది అని హితవు పలికారు. తాండూరుకు చుట్టపు చూపుగా వచ్చి ఆనందంగా వెళ్ళండి కానీ రాక్షస ఆనందం కోసం రావద్దన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుంటే ఫాంహౌస్‌లో రెస్టు తీసుకుంటేనే మేలని అన్నారు. బుయ్యని బ్రదర్స్ ప్రజా సేవలో చాలా సంవత్సరాలుగా ఉన్నారని, వారికి కొత్తగా తెలుసుకోవాల్సింది నేర్పించాల్సింది ఏమి లేదన్నారు.
వారిని విమర్శించే స్థాయి కూడా మీది కాదు అని తెల్సుకోవాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాండూరులో భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు, డ్రగ్స్ సరఫరా, ఆకతాయిల గొడవలు, దౌర్జ్యనాలు, నేరాలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయని అన్నారు. ఇప్పుడిప్పుడే యువత అడుగులు మంచి వైపు వెళ్తున్నాయని దానికి చెడగొట్టే ప్రయత్నం చేయరాదని సూచించారు. మరోసారి విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.
ఇదికూడా చదవండి…

