కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
– రూ. 2.5లక్షలు ఆర్థిక సాయం అందజేత
– మానవత్వం చాటుకున్న తోటి కానిస్టేబుళ్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి తోటి కానిస్టేబుళ్లు చేయూత అందించారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం వాల్మీకీనగర్ కు చెందిన కావలి రవీందర్ పెద్దేముల్ పోలీస్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహించేవాడు. ఈనెల 6న గుండె పోటుకు గురై మరణించాడు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాద్ జిల్లాకు చెందిన 2011 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు ఆదివారం కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి తమవంతు సాయంగా రూ. 2లక్షల 5వేలను అందజేసి తమ తోటి కానిస్టేబుల్ పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా కుటుంబానికి ఏల్లప్పుడు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వెంకటేస్, జయప్ప, సురేష్ గౌడ్, అశోక్, సత్తార్, శాంతు, ప్రవీణ్, రామచందర్, పాండు, కృష్ణ, గోపాల్, వినోద్, రామకృష్ణ, ప్రవీణ్, నర్సింలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

