అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి
– కోటేశ్వర దేవాలయం, బడి పురోగతికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలోని బాల విహార్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరులో ప్రసిద్ధ దేవాలయాలు వెలసిన పుణ్యం ఫలంతో అంతా సుభిక్షంగా ఉన్నామన్నారు.

ఎమ్మెల్యేగా తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కోటేశ్వర దేవాలయం, గుడిలోని బడి పురోగతికి తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు దేవాలయంకు మైక్ సెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, డా.సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పాత తాండూరు పెద్దలు, ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వాల్మీకీల సంక్షేమానికి కృషి