తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
– ఫ్రీగా పరీక్షలు, అవసరమైతే ఆపరేషన్లకు రిఫర్
– లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తాండూరు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రకటించారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ గురువారం, 4వ గురువారం ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపం రోడ్డు మార్గంలో ఉన్న రేయిన్ బో చిన్న పిల్లల దవఖానాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 10-30గంటల నుంచి మధ్యాహ్నం 1-30 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతున్నారు.

హైదరాబాద్‌ సాధూరాం కంటి ఆసుపత్రి వైద్య నిపుణులతో పరీక్షలు జరుగుతాయన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారికి హైదారాబాద్‌ తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవకాశాన్ని తాండూరు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

రెచ్చిపోయిన దొంగలు..!