ఎక్కడున్నావమ్మా.. స్వాతీ..!
– అదృశ్యమైన బాలిక కోసం విస్తృత గాలింపు
– నాలుగు రోజులుగా జల్లెడ పడుతున్న పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన 9 ఏండ్ల బాలిక కోసం తాండూరు రూరల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ మనుమరాలు స్వాతి(9) ఈనెల 22న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. రెండో రోజే లాలమ్మ తన మనుమరాలు అదృశ్యమైనట్లు కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక అదృశ్యం కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పుకార్లు రావడంతో సంఘటన ఆందోళన రేపింది.
ఫిర్యాదు తీసుకున్న నాటి నుంచి ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. రెండు బృందాలను ఏర్పాటు చేశారు. అదృశ్యమైన రోజు బాలిక కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు గుర్తించారు. గురువారం బాలిక ప్రస్తుత తీరులో ఉన్న ఫోటోలు వి డుదల చేశారు. ప్రత్యేక బృందాలతో ఆర్టీసీ బస్సులు, ఆటోలతో పాటు ప్రయాణ మార్గాలలో బాలిక ఫోటో చూపిస్తూ విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిస్తే తాండూరు డీఎస్పీ సెల్ : 8712670017, కరణ్ కోట్ ఎస్ఐ సెల్: 8712670052లకు సంప్రదించాలని సూచించారు. ఈ విషయం తెలిసిన అందరు ఎక్కడున్నావమ్మా.. స్వాతి.. త్వరగా ఆచూకీ దొరకాలని కోరుకుంటున్నారు.
ఇదికూడా చదవండి…

