మా కౌన్సిలర్‌పై అబాండాలు వేయోద్దు…!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా కౌన్సిలర్‌పై అబాండాలు వేయోద్దు…!
– గాంధీనగర్ కౌన్సిలర్‌కు ప్రజల మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా కౌన్సిలర్‌పై లేనిపోని అబాండాలు వేయొద్దని తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు కౌన్సిలర్‌ సంగీత ఠాకూర్‌కు ఆ వార్డు ప్రజలు మద్దతు తెలిపారు. వార్డులో కౌన్సిలర్ ఎలాంటి పనులు చేయడం లేదని, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని వార్డుకు చెందిన కొందరు విమర్శించాడాన్ని ఖండించారు. కావాలనే కౌన్సిలర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వార్డులో ఆమె ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. వార్డులో మురుగు కాలువలు, వీధి దీపాలు, రోడ్లతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడి, మహిళ సంఘాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 30 నుంచి 70 మందికి చేర్చి పాఠశాల అభివృద్ధికి చొరవ చూపుతున్నారని వివరించారు. వార్డు కౌన్సిలర్‌కు మద్దతుగా ఉంటామని, ఆమెపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని అభిప్రాయాలను తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఎంసీహెచ్‌లో ప్రోటోకాల్ రగడ..!